Wednesday, June 30, 2010

ఈ రౌడి రాయుడి కొన్ని ఛాయాచిత్రములు :D








ఏ జన్మలోనో భౌ భౌ బోలెడు పుణ్యం చేసుంటా ఇంత మంచి అన్న దొరికాడు నాకు



అన్న నేను ఏరోప్లేన్ ఆట ఆడుకుంటున్నాము.. ఆ ఆట నాకు చాలా ఇష్టం


అన్న ప్రేమ హేమిటో?? కాలు కింద పెట్టనివ్వడనుకోండి..


అన్నని అలా అపుడపుడు బైక్ మీద షికారు తీసుకుకెళుతుంటా..

Thursday, June 24, 2010

శీనన్న నీ మీద అలిగా...

(అన్న మీద అలిగాను )


హిహి... అలగడమేగా నా పని మరి. ఏదో నా gf సాయంతో బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే... శీనన్న నా ఫస్ట్ పోస్ట్ లో ఏం కామెంటాడో చూడండి. నా అడ్వంచర్స్ నన్నే రాసుకోమంటున్నాడు. ఎంత బుజ్జోడ్ని నేను... కాస్త కూడా జాలి లేదు!! ఆ అడ్వంచర్స్ ఏవో శీనన్న చెబితేనే కదా నా బ్లాగ్ మొదలుపెట్టిన ఈ అమ్మాయికి తెలిసేది.

అనగనగా ఓ సారి ఈ అమ్మాయి నీ బ్లాగు చదువుతూ అపుడెపుడో నీ ఆర్కుట్ లింక్ ఉంటే అది ఓపెన్ చేసింది. దాంట్లో రాయుడు అని ఉంటే, ఏవరా ఈ పెద్దమనిషి అని చూస్తే దాంట్లో నేనున్నా. పాపం ... luv at first sight అంట. అయిన నాలాంటి అందగాడికి ఎవరు మాత్రం పడకుండా ఉంటారు? మీరే చెప్పండి. అందులోను మన date of birth అలాంటిది(14-02-2009 – valentines day). దాని మహత్యం అనుకుంటా.

ఏదో ఈ అమ్మాయి అడిగింది కదా అని... నా జన్మ రహస్యాలు అన్ని రాయుడిగారి కథ అని ఓ పోస్ట్ రాసేసావు. అది చదివి ఈ అమ్మాయి నాకు 143 కూడా చెప్పమన్నట్టు ఉంది... కానీ శీనన్న నాకు ఆ సంగతి చెప్పకుండా దాచాడు. ఈ సంగతి నాకెలా తెలిసింది అని అనుకుంటున్నారా??? నా గురించి ఈ మధ్య ఓ పోస్ట్ వేసాడుగా రెస్పాన్స్ ఎలా ఉందా అని అన్న అలా బయటకెళ్ళినపుడు…. అన్న బ్లాగు దొంగచాటుగా చూసేసా.

(అపుడపుడు అన్న బ్లాగ్ దొంగచాటుగా చక్కబెడుతుంటా)


అబ్బో మనకి పిచ్చి ఫ్యాన్స్ పొగయ్యారులే. అపుడు కామెంట్స్ లో ఈ అమ్మాయి కామెంట్ చూసా. అసలు అన్న ఈ పోస్ట్ వేసింది ఈ నా ఫ్యాన్ గారి కోసమంట..

పాపం అన్న మా అమ్మ దగ్గరనుండి వేరు చేసేటపుడు అంత బాధపడ్డాడని ఆ పోస్ట్ చదివి అర్ధం అయింది. ఏదో అలిగినట్టు నటిస్తా కానీ.... అన్నఎంత మంచోడో. ప్లీజ్ అన్న ఏ చేతులతో అయితే నన్ను అంత అపురూపంగా పట్టుకున్నావో ఆ చేతులతోనే నా మిగిలిన స్టోరీలు కూడా రాసేయవా!!

(anna luvs me lottttttt ofcourse I toooooooooo)



నా ఫ్యాన్స్ కోసం నా ఫొటోలు కొన్ని నీ పర్మిషన్ లేకుండా ఇక్కడ అప్లోడ్ చేసాను. ఇష్టం లేకపోతే చెప్పు..


సరే ఉంటా టాటా భౌభౌ..

ఇట్లు
ఓల్ ఒంగోల్ అందగాడు మీ రాయుడు.